ఆకట్టుకుంటున్న ‘23’ ట్రైలర్!

23 movie: టాలెంటెడ్ దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘23’ నుంచి హార్డ్ హిట్టింగ్ ట్రైలర్ విడుదలైంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా సమాజంలో అమాయకుల గురించి కీలక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ట్రైలర్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం మే 16న థియేటర్లలో సందడి చేయనుంది.
‘23’ ట్రైలర్ రా అండ్ రస్టిక్ టేకింగ్‌తో ఆకట్టుకుంటోంది. అమాయకులు తప్పుడు కేసుల్లో ఇరుక్కొని ఎలా బలైపోతున్నారు? చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్నలతో ఈ సినిమా రూపొందింది. ట్రైలర్లో ఓ యువ జంట ఎదుర్కొన్న సవాళ్లను ఆవిష్కరించారు. రాజ్ ఆర్ డైరెక్షన్లో సహజత్వం, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
స్టూడియో 99, స్పిరిట్ మీడియా నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం దర్శకుడికి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందనేది ఆసక్తికరం. మే 16న విడుదలకు సిద్ధమవుతున్న ‘23’ ప్రేక్షకులను ఆలోచింపజేసే డ్రామాగా కనిపిస్తోంది. ఈ సినిమాతో సమాజంలో మార్పు తీసుకొచ్చే చర్చలు మొదలవుతాయా? వేచి చూడాలి.