అంతర్జాతీయం

ఉక్రెయిన్ యుద్ధంలో పట్టుబడ్డ భారతీయుడు సాహిల్ హుస్సేన్

ఉక్రెయిన్ యుద్ధభూమిలో మరోసారి భారతీయుడు పట్టబడటం సంచలనంగా మారింది. గుజరాత్ మోర్బిలోని 22 ఏళ్ల మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్‌ను ఉక్రెయిన్ సైన్యం బంధించిన వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వీడియోను పరిశీలించినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రష్యాలో నివశిస్తున్న సమయంలో హుస్సేన్ మాదకద్రవ్యాల కేసులో ఏడేళ్ల జైలు శిక్షకు గురయ్యాడని తెలుస్తోంది. ఐతే జైలు శిక్ష సమయంలో హుస్సేన్‌కు రష్యా ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

సైన్యంతో ఒప్పందం చేసుకుంటే కొన్నాళ్లకే శిక్షను రద్దు చేస్తామన్న సందేశం అందించింది. దీంతో సైనిక చర్యలో తాను కూడా భాగమయ్యేందుకు సంతకం చేశానని హుస్సేన్ తెలిపాడు. కానీ ఈ విషయమై, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. హుస్సేన్ వేలు ముద్రలు పరిశీలిస్తున్నామని, ఉక్రెయిన్ వైపు నుంచి ఇంకా తమకు ఎలాంటి అధికార సమాచారం అందలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

మొత్తంగా ఇలాంటి పరిస్థితి భారతీయుడికి ఎందుకు వచ్చిందన్న చర్చ సాగుతోంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇది అత్యంత కలవర పరిచే కథ. హుస్సేన్ విశ్వవిద్యాలయంలో చదువుకోడానికి రష్యాకు వెళ్లాడు. అక్కడ ఉంటూ అనూహ్య పరిస్థితుల్లో ఇలా ట్రాప్ అయినట్టు తెలుస్తోంది. అతను ఒక ఒప్పందానికి అందుకున్నాడు. జైలులో ఉండటం బదులు, రష్యన్ దళాల కింద శిక్షణ తీసుకుని యుద్ధంలో పోరాడితే శిక్ష తప్పుతుందన్న అభయాన్ని పొందాడు.

16 రోజుల శిక్షణ అనంతరం అతనిని అక్టోబర్ 1న మొదటి మిషన్‌కు పంపించినట్టు చెప్పాడు. కానీ మూడు రోజుల పోరాటమే తర్వాత అతను కమాండర్‌తో తారుమారు అయ్యి, ఉక్రెయిన్ బలగాలకు లొంగిపోయానని వీడియోలో చెప్పాడు. తాను జైలులో ఉండటానికి ఇష్టపడలేదని, ప్రత్యేక సైనిక చర్య ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రకు రష్యా పెట్టిన పేరు కోసం ఒప్పందం చేసుకున్నానన్నాడు.

రష్యా దళాలు తనకు 16 రోజుల శిక్షణ ఇచ్చాయని, అక్టోబర్ 1న మొదటి పోరాట మిషన్‌కు పంపించారని, ఉక్రెయిన్ సైన్యానికి హుస్సేన్ వివరించాడు. యుద్ధంలో తాను మూడు రోజులు పోరాడానని, ఆపై తన కమాండర్‌తో వివాదం తర్వాత ఉక్రెయిన్ దళాలకు లొంగిపోయానని చెప్పాడు. రెండు మూడు కిలో మీటర్లు నడిచి రైఫిల్ పక్కనపడేసి లొంగిపోయానన్నాడు.

వాస్తవానికి లాభదాయకమైన ఉద్యోగాలు లేదా ఇతర అవకాశాల వాగ్దానాలతో రష్యా దళాలు భారత్, ఉత్తర కొరియాతో సహా ఇతర దేశాల నుండి జాతీయులను చేర్చుకుంటున్నాయని గతంలో అనేర నివేదికల వచ్చాయి. రష్యా సైన్యంలో చేరినందుకు తనకు ఆర్థిక పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అది తనకు నేటికీ అందలేదని హుస్సేన్ చెప్పాడు. తాను తిరిగి రష్యాకు వెళ్లాలనుకోవడం లేదని, ఉక్రెయిన్‌ జైలుకు వెళ్లడమే మంచిదని భావిస్తున్నానన్నాడు.

హుస్సేన్ చెప్పిన మాటలు మన దేశ యువతకు గట్టి హెచ్చరికలు. రష్యా దళాలు విదేశీయులను ఉద్యోగాలు, పెట్టుబడులంటూ మోసం చేస్తున్నట్టు తెలుస్తోంది. హుస్సేన్ కూడా ఇలాంటి వాగ్దానాలతో మోసపోయినట్టు తెలుస్తోంది. కానీ ఎలాంటి ప్రతిఫలం దక్కకుండానే చివరకు ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డాడు. గత జనవరిలో రష్యాలో సెటిలవ్వొచ్చని వెళ్లిన 126 మందిలో 12 మంది భారతీయులు మరణించారని, 16 మంది మిస్సాయరని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఐతే తాజాగా బయటకు వచ్చిన హుస్సేన్ వీడియో అసలా, నకిలీయా అన్నదానిపై చర్చ జరుగుతోంది. జైల్లో ఒప్పందం కుదుర్చుకొని, రష్యా సైన్యంలో సిబ్బందిగా, ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడగలిగాడా లేదా అన్నది తేలాలి. ఇవన్నీ డిప్లొమేటిక్ స్థాయిలో నిర్ధారణకు రానున్నాయి. అదే సమయంలో హుస్సేన్ ఘటన యువతకు ఒక స్పష్టమైన సంకేతం. విదేశాల్లో అవకాశాల కోసం ఎలా పడితే అలా నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరమని తాజా ఉదంతం రుజును చేస్తోంది. హుస్సేన్ కేసు దేశ యువత మొత్తానికి హెచ్చరిక. సోషల్ వార్నింగ్. ప్రభుత్వం తక్షణమే అన్ని వివరాలు చెప్పాలి. బాల్టిక్ నుంచి ఇండో-పెసిఫిక్ వరకూ పలు దేశాల్లోని భారతీయుల భద్రతకు సంబంధించిన పాలసీ కట్టుదిట్టంగా సమీక్షించాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button