జాతియం
Maoists: ఒడిశాలో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

Maoists: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 22 మంది మావోయిస్ట్ పార్టీ నక్సలైట్లు ఒడిషా డీజీపీ వై.బి. ఖురానియా ముందు లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు, 15 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
మూడు AK-47 రైఫిల్స్, ఒక INSAS రైఫిల్, ఐదు 303 రైఫిల్స్, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, 13 టిఫిన్ బాంబులను లొంగిపోయిన నక్సల్స్ పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన నక్సల్స్‌పై మొత్తం 2 కోట్ల నగదు రివార్డు ఉన్నట్లు డీజీపీ వై.బి. ఖురానియా వెల్లడించారు.



