తెలంగాణ
Dog Attack: వీధి కుక్కల బీభత్సం.. 20 మందికి తీవ్ర గాయాలు

Dog Attack: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. పట్టణంలోని మదినా కాలనీ, గణేష్ నగర్‌తో పాటు పలు ప్రాంత్లాలో చిన్న, పెద్ద తేడా లేకుండా కుక్కలు దాడులకు పాల్పడ్డాయి. సుమారు 20 మంది వరకు కుక్కల దాడిలో గాయపడగా భైంసా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారులు స్పందించి వీధి కుక్కలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



