తెలంగాణ
Nirmal: వింత వ్యాధితో 20 మేకలు మృతి

Nirmal: నిర్మల్ జిల్లాలో మేకలకు వింత వ్యాధి సోకుతుంది. భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన కదం దత్తురాంకు చెందిన 20 మేకలకు సీసీపీఎన్ సోకి చనిపోయాయి. మేకల మందలో పెద్ద మేకల్లో చొంగ కార్చుతూ చనిపోయాయి. సుమారు 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని దత్తురాం రోధించాడు. ఈ వ్యాధి నివారణకు సరైన మందులు లేవని పశు వైద్యులు చెబుతున్నారు. దీంతో మేకల మంద ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.