తెలంగాణ
జహీరాబాద్-బీదర్ రహదారిపై రోడ్డు ప్రమాదం .. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బీదర్ రోడ్డు రైల్వే గేటు సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో జహీరాబాద్ మండలానికి చెందిన రాజు, కర్ణాటకకు చెందిన ఆసిఫ్‌గా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



