తెలంగాణ
Telangana: హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
Telangana: హైదరాబాద్‌కు ఐటీ సంస్థలు క్యూ కడుతున్నాయి. పోచారంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ ముందుకొచ్చింది. ఆ క్యాంపస్‌లో 17 వేల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా.. ఒప్పందం చేసుకున్నారు మంత్రి శ్రీథర్ బాబు. ఈ మేరకు దావోస్‌లో ఇన్ఫోసిస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నది తెలంగాణ ప్రభుత్వం.
మరోవైపు.. హైదరాబాద్‌లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు విప్రో కంపెనీ ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా.. విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రేమ్ జీతో సీఎం రేవంత్, మంత్రి మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తర్వాత కీలక ప్రకటన విడుదల చేశారు.