జాతియం
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది సజీవ దహనం

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లా జవరగుండనహళ్లి శివారులో తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమయ్యారు.
మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తున్న బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ సహా పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



