సినిమా

Athadu: వరల్డ్ రికార్డ్ సృష్టించిన సూపర్ స్టార్ 'అతడు'!

Athadu: దాదాపు 20 ఏళ్ళ క్రితం విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘అతడు’ మూవీ ఇప్పటికీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 2005 లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్, త్రిష జంటగా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ మాయచేశాయి. ఇప్పటికీ కూడా ఆ డైలాగ్స్ మారు మొగిపోతూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డు సృష్టించింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టెలివిజన్ లో ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు టెలికాస్ట్ అయ్యింది. ఇక తాజాగా 1500 సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా ఘనతను సాధించింది. ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టీవీలో ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. అతడు సినిమాని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని చిత్రీకరణ ప్రారంభించినట్లు సమాచారం.అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈసినిమా 2027 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button