తెలంగాణ
సూర్యాపేట జిల్లా కోదాడలో 150 గొర్రెలు మృత్యువాత

Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడలో విషపూరితమైన మొక్కలు తిని 150 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో యజమాని కొర్ల శివకుమార్ కన్నీరుమున్నీరయ్యారు. మేతకు వెళ్లి వచ్చిన గొర్రెల మందలోని 150 గొర్రెలు రాత్రి ఆకస్మాత్తుగా మృత్యువాత పడ్డాయి.
కాగా ఘటనపై పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వగా గొర్రెలను పరిశీలించి విషపూరితమైన మొక్కలు తినడంతో మృతిచెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృత్యువాత పడ్డ గొర్రెల విలువ 15 లక్షలు ఉంటుందని గొర్ల కాపరులు తెలిపారు.



