జాతియం
Kolkata: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

Kolkata: కోల్కతాలోని రితురాజ్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా 14 మంది మృతి చెందారు. మరికొంత మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. హోటల్ భవనంలో మరికొంత మంది చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్త అవుతున్నాయి.