అంతర్జాతీయం
టెక్సాస్ లో వరదలు…104 మంది మృతి

అమెరికా టెక్సాస్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 104కు చేరింది. వరదలు తీవ్రంగా సంభవించిన కేర్ కౌంటీ ప్రాంతంలోనే 84 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 32 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. వరదల ధాటికి పదుల సంఖ్యలో కార్లు కొట్టుకువచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పాకిస్థాన్లో జూన్ 26 నుంచి వరదలు సంభవించి 72 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.