తెలంగాణ
పిడుగు పడి 100కు పైన గొర్రెలు మృతి

భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి,లెంకల గడ్డ గ్రామాల సమీపంలోని గోదావరి ఒడ్డున సుమారు వందకు పైన గొర్రెలు పిడుగు పడి మృతి చెందాయి. గోదావరి ఒడ్డున గొర్రెలను మేతకు తీసుకెళ్లే క్రమంలో జాలీల కంచెలో గొర్రెలను ఉంచారు. భోజనానికి వెళ్లిన సమయంలో పిడుగు పడి వంద గొర్రెలు మృతి చెందినట్లు కాపరులు తెలిపారు. తమ జీవనోపాధిని కోల్పోయాం అని ప్రభుత్వం ఆదుకోవాలని కాపరులు కోరుతున్నారు.



