తెలంగాణ

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న పోలింగ్‌.. ఉదయం 9గంటల వరకు 10.2శాతం పోలింగ్

Jubilee Hills By-Election: ఉదయం 9 గంటల వరకు 10.2 శాతం పోలింగ్ శాతం నమోదైంది. మందకొడి పోలింగ్‌తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. 4 లక్షల మంది ఓటర్లున్నా 9 గంటలకు 10.2 శాతం పోలింగ్ మించలేదు. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం 47.58 శాతానికే పోలింగ్ పరిమితమైంది.

ఓటర్లంతా బూత్‌లకు తరలివచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్ల క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీల్లోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాట్లు పడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button