టాలీవుడ్
సారీ సోదరా.. తొందరపడ్డాను.. జర్నలిస్టుకు క్షమాపణ చెప్పిన మోహన్ బాబు
మీడియా ప్రతినిధిపై దాడి చేసినందుకు సినీ నటుడు మోహన్ బాబు క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదన్నారు. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద జరిగిన దాడిలో గాయపడిన జర్నలిస్టు రంజిత్ వద్దకు మోహన్ బాబు వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను మోహన్‌బాబు, మంచు విష్ణు పరామర్శించారు. జరిగిన ఘటనపై జర్నలిస్టు రంజిత్‌కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. అది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని చెప్పారు. మరోవైపు మోహన్‌బాబు నివాసం వద్ద డిసెంబర్ 10వ తేదీ రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మోహన్‌బాబుపై కేసు నమోదైంది.