తెలంగాణ
Adilabad: ఆర్టీసీ బస్సులో మంటలు.. తృట్టిలో తప్పిన పెను ప్రమాదం

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజన్ నుండి పొగలు రావడంతో ప్రయాణికులను బస్సు నుండి డ్రైవర్ దింపేశాడు. ప్రయాణికులు దిగిపోగానే ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.



