తెలంగాణ
Ramchandra Rao: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రాంచందర్ రావు

Ramchandra Rao: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షులు రాంచందర్ రావు చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. కాగా కాసేపట్లో గన్‌పార్క్ వద్దకు రాంచందర్ రావు చేరుకోనున్నారు. అక్కడ అమరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు.
ఇటీవల తెలంగాణ బీజేపీ నయా చీఫ్‌గా రాంచందర్ రావు ఎన్నికయ్యారు. ఇవాళ ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11గంటలకు రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. రాంచందర్ రావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.