సినిమా

‘కేడీ ది డెవిల్’ నుంచి ‘శివ శివ’ పాట విడుదల..

కన్నడ ఇండస్ట్రీలో భారీ చిత్రాలను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా ‘కేడీ ది డెవిల్’ అనే చిత్రం రానుంది. విజనరీ డైరెక్టర్ ప్రేమ్‌ దర్శకత్వంలో ఈ మూవీని భారీ ఎత్తు తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కన్నడ నేల ఆచార సంస్కృతులు, భారతీయ జానపద గేయాల్లోని అందాన్ని చూపించేలా ‘శివ శివ’ అనే పాటను రిలీజ్ చేశారు.

ఈ పాటను హిందీలో అజయ్ దేవగణ్, తమిళంలో లోకేష్ కనకరాజ్, తెలుగులో హరీష్ శంకర్ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. అర్జున్ జన్యా బాణీ, విలియం డేవిడ్ కొరియోగ్రఫీ పాటలోని డెప్త్ ఇండియన్ ఫోక్ మ్యూజిక్‌ గొప్పదనాన్ని చాటి చెబుతున్నాయి. కన్నడలో ఈ పాటను ప్రేమ్, కైలాష్ కేర్ ఆలపించారు. తెలుగు, తమిళంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో ప్రణవం శశి పాడారు. ఇక హిందీలో కైలాష్ కేర్, సలీమా మాస్టర్ కలిసి ఆలపించారు.

కన్నడలో ఈ పాటను మంజు నాథ్ బి.ఎస్, తమిళంలో మదన్ కార్కి, తెలుగులో చంద్రబోస్ హిందీలో రక్విబ్ ఆలం, మలయాళంలో మన్‌కోంబు గోపాలకృష్ణన్ రాశారు. ఆనంద్ ఆడియో లేబుల్ మీద ఈ పాటను మార్కెట్‌లోకి విడుదల చేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిభింబించేలా, భారతీయ జానపద గీతాల్లోని అందాన్ని చూపించేలా ఈ ‘శివ శివ’ అనే పాట సాగుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button