News
కాంగ్రెస్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్

Harish Rao: కాంగ్రెస్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 84శాతం పూర్తి చేసిందని హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 14 నెలలు గడిచినా 16శాతం పనులు పూర్తి చేయలేని స్థితిలో ఉందని విమర్శించారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే రేవంత్‌రెడ్డి ఆస్పత్రి నిర్మాణ పనులు ఆలస్యం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.