మిస్టరీగానే గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు

Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు మిస్టరీగా ఉంది. గండికోట మైనర్ బాలిక కేసు కాస్త సమయం పడుతుందని డీఐజీ ప్రవీణ్ అన్నారు. సెల్ టవర్ ఆధారంగా 350 మంది అనుమానితుల ముబైల్ సిగ్నల్స్ గుర్తించామన్నారు అదే రోజు పక్కనే ఉన్న గ్రామంలో ఒక జాతర జరిగింది. రెండు సెల్ టవర్ల సిగ్నల్స్ ఒకే ప్రాంతంలో ఉండడంతో విచారణ చేయడం ఆలస్యం అవుతోందన్నారు మిగిలిన 60 మందిని విచారించాల్సి ఉంది విచారణలో వేగం పెంచామన్నారు.
గండికోట ప్రాంతంలో మైనర్ పిల్లలకు గదులు ఇవ్వొద్దని స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగిందన్నారు కుటుంబ సభ్యుల పైనా ఆరోపణలు రావడం నిజమే వాటిని కూడా పరిశీలిస్తున్నామని డీఐజీ ప్రవీణ్ తెలిపారు. మైనర్ బాలిక వైష్ణవీ హత్య కేసు దర్యాప్తు దశలో ఏమీ చెప్పలేమని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఈ కేసును వీలైనంత తొందరగా చేధిస్తామన్నారు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యం లేనందున విచారణ ఆలస్యం అవుతోందన్నారు. కుటుంబ సభ్యుల ప్రమేయంపై సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ చేస్తాం పోలీసులకు ఎలాంటి దివ్య శక్తులు లేవు మానవ శక్తిపై ఆధారపడి విచారణ కొనసాగిస్తున్నామని డీఐజీ ప్రవీణ్ చెప్పారు.