జాతియం
Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది . గరియాబంద్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో.. 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. అంతేకాదు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతోనే భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టారు. ఇక కాల్పుల్లో శ్రీకాకుళం కోరాపుట్ డివిజన్ ఇన్‌ఛార్జ్ చలపతి మృతి చెందినట్లు టాక్ వినబడుతోంది.
మావోయిస్టు చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా. మరోవైపు అడవిలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా అడవిలో కూంబింగ్ కొనసాగుతోంది. ఈ కూంబింగ్‌లో గరియాబంద్ డీఆర్‌జీ, ఒడిశా ఎస్‌వోజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.