ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

Srisailam: ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీశైలం జలాశయం ఒక్క గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. గేటును 10 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేశారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి లక్షా 42 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఔట్‌ఫ్లో 94 వేల 709 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
శ్రీశైలం జలాశయం నీటిమట్టం 883.70 అడుగులుగా ఉంది. నీటినిల్వ 208 టీఎంసీలుగా నమోదైంది. ఈ సీజన్‌లో రెండోసారి గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.