National Film Awards: 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు: తెలుగు సినిమాల జైత్రయాత్ర!

71st National Film Awards 2025: భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. తెలుగు సినిమాలు అద్భుత విజయం సాధించాయి. బాలకృష్ణ భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా గెలుపొందగా, బలగం, బేబీ, హనుమాన్ చిత్రాలు కూడా అవార్డులను అందుకున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాటకు కాసర్ల శ్యామ్ ఉత్తమ గీత రచయితగా ఎంపికయ్యారు. బేబీ చిత్రానికి సాయి రాజేష్ ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు అందుకోగా, హనుమాన్ చిత్రం యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌లో గెలిచింది.
నాన్-ఫీచర్ విభాగంలో గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచింది. ఇతర విభాగాల్లో పార్కింగ్ ఉత్తమ తమిళ చిత్రంగా, 12th ఫెయిల్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డులు అందుకున్నాయి. రాణి ముఖర్జి ఉత్తమ నటిగా, షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సె ఉత్తమ నటులుగా గుర్తింపు పొందారు.